కామేపల్లి, వెలుగు : టీబీ వ్యాధి సోకిన వారు భయపడాల్సిన పనిలేదని, మందుల ద్వారా తగ్గించవచ్చునని జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుబ్బారావు తెలిపారు. టీబీ వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా బుధవారం కామేపల్లి మండలం పొన్నెకల్లు గ్రామంలో ఏర్పాటు చేసిన టీబీ క్యాంప్ ను ఆయన ప్రారంభించారు.
సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ రెండు వారాలకు మించి జ్వరం ఉండటం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, నీరసంగా ఉండడంపాటు తెమడ తోపాటు రక్తచారలు పడడం లాంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలని సూచించారు. రిపోర్ట్ పాజిటివ్ గా వస్తే ఆరు నెలలపాటు మందులు వాడాలని చెప్పారు. నెలకు రూ.వెయ్యి చొప్పున టీబీ పేషెంట్ అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శిరీష, సర్పంచ్ భూమిక, ఉప సర్పంచ్ వసంతరావు, వీవో సబిత, హెచ్ ఈవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
